Free online Gynecologist .Advice tips ebooks videos

free pregnancy information ,,free pregnancy tips, videos,ebooks,download ,calender,complications preventions methods, techniques, delivery trics,free online gynecologist advice

Tuesday 16 February, 2010

కామెర్ల పేషెంట్ కథ ..A STORY OF JAUNDICE PATIENT.

అసలు దేవుడు  వున్నాడా?
ప్రతి రోజు నాకు ఇదే డౌట్ .రోజు రోజుకి పెరిగి పోతుంది . వుంటే కొందరికి అన్యాయం,ధనికులకి సౌభాగ్యమా?
లేబర్ రూం ఇన్ ఛార్జ్ గా వున్న నాకు రోజు రోజుకి హృదయాన్ని ద్రవించే సంఘటనలు కనిపించటం పెరుగుతూనే వున్నాయి.
ప్రమాదకరమైన జబ్బులు పేదవారికి ,ధనికులకి సమానం గానే ఇచ్చిన దేవుడు డబ్బు మాత్రం సమానం గా పంపిణి చేయలేదు .పస్తుతం లేబర్ రూం లో ఒక వైరల్ కామెర్లు ( హెపటిటిస్ -బి ) రోగి వుంది .ఆమె పేరు దుర్గాబాయి ( పేరు మార్చబడింది ).వయసు 20 .వూరు జంగారెడ్డి గూడెం దగ్గర వున్న ఒక పల్లెటూరు .కాయా కష్టం చేసి రోజు వారి కూలి డబ్బులుతో బ్రతికే బక్కజీవులు .
దుర్గాబాయి కి పెళ్లి ఐయింది .ఎనిమిది నెలల గర్బవతి గా వున్నప్పుడు (కడుపు లోనే) బిడ్డ  చనిపోయింది .డెలివరీ కష్టం కావడం తో సిజేరియన్ ఆపరేషన్  చేసి కడుపులో చనిపోయిని బేబీ ని బయటికి తీయవలిసి వచ్చింది .కుటుంబమంతా దుఃఖ సాగరం  లో మునిగారు .
రెండవ సారి  గర్బం దాల్చిన దుర్గాబాయి ని చూసి కుటుంబం ఆనందించే లోగానే మరో ప్రమాదకరమైన  సంగతి తెలిసింది .దుర్గాబాయి కి కామెర్ల జబ్బు వచ్చింది .అత్యంత దారుణమైన హెపటిటిస్ -బి వైరస్ వ్యాధి . తెలిసాక వెంటనే దగ్గరలోని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు .అక్కడ డాక్టర్ పోస్ట్ ఖాళీ.నర్సు తనవల్ల కాదని చెప్పి ప్రైవేటు హాస్పిటల్ కి లేదా విజయవాడ సిటీ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చింది .ఖర్సులు కి భయపడి దూరమని  దగ్గరలో ని ఏలూరు వెళ్లారు .అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ .కాని వ్యాధి నిపుణులు డాక్టర్స్ కొరత .చివరికి విజయవాడ రాక తప్పలేదు .
 కేసు హిస్టరీ చదవ గానే అర్దమైంది .హై రిస్క్ కేసు .జనరల్ మెడిసిన్ / గాస్త్రో ఏంటి రోలజిస్ట్ , గైనకా లజిస్ట్ , స్కాన్నింగ్ డాక్టర్ , ల్యాబ్  డాక్టర్స్ , ఇలా చాలా మంది కావాలి .
ఈసారి ఆమె గర్భం నిలుస్తుందా?
 కామెర్లతో ఆమె బ్రతికి బయట పడుతుందా?
అదృష్టమో మాయో  కాని ఆమె బ్రతికింది
కాని మళ్లీ బిడ్డ ని కోల్పోయింది
 మాకు ఒక భాదాకరమైన కేసు .వైరస్ కి ఇంకా మందు కనిపెట్ట లేక పోవడం వల్లే కదా  ఎయిడ్స్ ఇలా హెపటిటిస్ తో రోగులు చనిపోతునే వున్నారు .
.